Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

హనుమకొండ కలెక్టరేట్ ప్రజావాణికి భారీగా తరలివచ్చిన అర్జీదారులు

Author
Posted By Marelli kiran
| 17 Nov 2026, 07:56 AM |
హనుమకొండ కలెక్టరేట్ ప్రజావాణికి భారీగా తరలివచ్చిన అర్జీదారులు

హనుమకొండ, నవంబర్ 16, 2026 (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలను స్వీకరించి, వారి సమస్యలను ఓపికగా ఆలకించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 293 వినతులు అందినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రధానంగా భూ సమస్యలు, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించిన సమస్యలపై ప్రజలు దరఖాస్తులు సమర్పించారు. ప్రతి వినతిని కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులకు పంపించారు. ప్రజలు సమర్పించిన అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా, నిర్దిష్ట గడువులోగా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణికి వచ్చే ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక దృష్టి సారించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.