Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కేయూలో ఘనంగా 24వ స్నాతకోత్సవం.. ఈ నెల 28న హాజరుకానున్న గవర్నర్ శివప్రతాప్ శుక్లా

Author
Posted By Marelli kiran
| 17 Nov 2026, 07:51 AM |
కేయూలో ఘనంగా 24వ స్నాతకోత్సవం.. ఈ నెల 28న హాజరుకానున్న గవర్నర్ శివప్రతాప్ శుక్లా

హనుమకొండ, నవంబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): కాకతీయ యూనివర్సిటీ (కేయూ) 24వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 28వ తేదీన ఉదయం 10 గంటలకు యూనివర్సిటీ క్యాంపస్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం వెల్లడించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ ఛాన్సలర్ శివప్రతాప్ శుక్లా అధ్యక్షత వహించనున్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సులను పూర్తిచేసిన విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయనున్నారు. అలాగే విద్యా రంగంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సంబంధిత పురస్కారాలు, గౌరవాలు అందించే అవకాశం ఉంది.

సైయెంట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, చైర్మన్, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్నాతకోత్సవ ప్రసంగం చేయనున్నారు. స్నాతకోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు యూనివర్సిటీ అధికారులు క్యాంపస్‌లో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కార్యక్రమానికి హాజరయ్యే అతిథులు, విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నారు.