Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కార్తీక మాసం సందర్భంగా ఘనంగా వనభోజనాలు, అన్నదానం

Author
Posted By Praja Nestham Jwala News
| 15 Nov 2026, 10:51 PM |
కార్తీక మాసం సందర్భంగా ఘనంగా వనభోజనాలు, అన్నదానం

బూరుగడ్డ, నవంబర్ 15 (ప్రజా నేస్తం జ్వాల): కార్తీక మాసాన్ని పురస్కరించుకుని బూరుగడ్డ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహ వేణుగోపాలస్వామి దేవాలయ ప్రాంగణంలో మంజునాథ గురుస్వామి పీఠం ఆధ్వర్యంలో వనభోజనాలు, అన్నదాన కార్యక్రమాన్ని ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ఉసిరి చెట్టు కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హుజూర్‌నగర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్, పలువురు కౌన్సిలర్లు ముఖ్య అతిథులుగా హాజరై భక్తులతో కలిసి వనభోజన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులతో పాటు గురుస్వాములను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. భక్తి, ఆధ్యాత్మికత, సోదరభావం వెల్లివిరిసిన ఈ కార్యక్రమంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. అన్నదాన కార్యక్రమంతో వేడుకలు విజయవంతంగా ముగిశాయి. కార్యక్రమాన్ని సమన్వయంతో నిర్వహించిన మంజునాథ గురుస్వామి పీఠం సభ్యులను పలువురు అభినందించారు.