Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

యాసంగిలో పంటల మార్పిడికి వ్యవసాయ శాఖ ప్రోత్సాహం

Author
Posted By Nagilla Rajinikanth
| 15 Nov 2026, 10:49 PM |
యాసంగిలో పంటల మార్పిడికి వ్యవసాయ శాఖ ప్రోత్సాహం

భీమదేవరపల్లి, నవంబర్ 15 (ప్రజా నేస్తం జ్వాల): యాసంగి సీజన్‌లో పంటల మార్పిడిని ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపడుతోంది. ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యత తగ్గడంతో పాటు విద్యుత్‌ సరఫరాలో సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు, నూనెగింజలు, కూరగాయల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. తక్కువ నీటితో, తక్కువ పెట్టుబడితో పంటలు సాగు చేయడంతో పాటు భూసారాన్ని మెరుగుపరచుకోవచ్చని పేర్కొంటున్నారు.

ఆరుతడి పంటలు, కూరగాయలు సాగు చేసే రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు, స్ప్రింక్లర్లు, మల్చింగ్‌ సదుపాయాలు కల్పించనుంది. అలాగే 25 ఎకరాల వరకు రైతులు సమిష్టిగా సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసుకుంటే రాయితీ అందించనుంది. ఈ పథకాల అమలులో భాగంగా వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు) గ్రామాల్లో పర్యటించి పంటల మార్పిడిపై ఆసక్తి ఉన్న రైతుల వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుకు ముందుకు రావాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరుతున్నారు.