Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పిల్లల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి

Author
Posted By Nagilla Rajinikanth
| 15 Nov 2026, 10:46 PM |
పిల్లల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి

భీమదేవరపల్లి, నవంబర్ 16 (ప్రజా నేస్తం జ్వాల): పిల్లల సమస్యల పరిష్కారానికి భీమదేవరపల్లి మండలంలో నిర్వహించే ప్రజావాణిలో ప్రత్యేకంగా బాలల ప్రజావాణి ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీడీవో వీరేశం తెలిపారు. సాధారణ ప్రజల సమస్యలు, ఫిర్యాదులతో పాటు పిల్లలకు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ పిల్లలు తమకు ఎదురవుతున్న సమస్యలపై సంబంధిత శాఖల అధికారులకు దరఖాస్తులు అందజేయవచ్చని తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మండలంలోని అన్ని గ్రామాల అధికారులు పిల్లలకు ఈ కార్యక్రమంపై సమాచారం అందించి, బాలల ప్రజావాణిలో వారు పాల్గొనేలా చూడాలని సూచించారు.