Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

జాతీయస్థాయి కరాటే పోటీల్లో వంగర గురుకుల విద్యార్థినికి స్వర్ణ పతకం

Author
Posted By Nagilla Rajinikanth
| 15 Nov 2026, 10:46 PM |
జాతీయస్థాయి కరాటే పోటీల్లో వంగర గురుకుల విద్యార్థినికి స్వర్ణ పతకం

భీమదేవరపల్లి, నవంబర్ 15 (ప్రజా నేస్తం జ్వాల): చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ వంగర బాలికల గురుకుల పాఠశాల విద్యార్థిని రుత్విక జాతీయస్థాయిలో ప్రతిభ చాటింది. జాతీయస్థాయి కరాటే పోటీల్లో స్వర్ణ పతకం సాధించి పాఠశాలకు, మండలానికి గుర్తింపు తీసుకొచ్చింది. ఆదివారం వరంగల్ జిల్లా కాజీపేటలో నిర్వహించిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో వంగర బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న రుత్విక పాల్గొంది. పోటీల్లో తన ప్రతిభను ప్రదర్శించి ప్రత్యర్థులను అధిగమిస్తూ గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. విద్యార్థిని సాధించిన విజయంపై పాఠశాల ప్రిన్సిపల్ హర్షం వ్యక్తం చేశారు. రుత్వికను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.