Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

హనుమకొండ కలెక్టరేట్‌లో రేపు ప్రత్యేక పిల్లల ప్రజావాణి

Author
Posted By Marelli kiran
| 15 Nov 2026, 10:42 PM |
హనుమకొండ కలెక్టరేట్‌లో రేపు ప్రత్యేక పిల్లల ప్రజావాణి

హనుమకొండ, నవంబర్ 15 (ప్రజానేస్తం జ్వాల): జాతీయ బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకుని హనుమకొండ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రత్యేకంగా పిల్లల ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణతో పాటు చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

విద్య, వైద్యం, పోషకాహారం, రక్షణ, పాఠశాలల్లో కనీస సౌకర్యాలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలకు సంబంధించి పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసే ప్రత్యేక డెస్క్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. చిన్నారులు తమ సమస్యలపై వినతులు సమర్పించవచ్చని, సంబంధిత శాఖల అధికారుల ద్వారా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు.