Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, బీజేవైఎం నేతల అరెస్టులను ఖండించిన చల్ల శ్రీలతరెడ్డి

Author
Posted By Praja Nestham Jwala News
| 14 Nov 2026, 08:24 PM |
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, బీజేవైఎం నేతల అరెస్టులను ఖండించిన చల్ల శ్రీలతరెడ్డి

సూర్యాపేట, నవంబర్‌ 14 (ప్రజానేస్తం జ్వాల): బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, బీజేవైఎం నాయకులను రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ముందస్తుగా అరెస్టు చేయడాన్ని బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో జాప్యం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ హామీల అమలుపై ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులను ముందస్తు అరెస్టుల పేరుతో నిర్బంధించడం ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధమని పేర్కొన్నారు. రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడం, ప్రభుత్వ విధానాలు, పనితీరుపై ప్రశ్నించడం ప్రతిపక్షాల హక్కు అని అన్నారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ముందస్తు అరెస్టులకు స్వస్తి పలకాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరెస్టుల ద్వారా బీజేపీ తన రాజకీయ కార్యక్రమాలను నిలిపివేయదని స్పష్టం చేశారు.