Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నేరేడుచర్లలో చికెన్ వాహనం నుంచి నగదు చోరీ.. నిందితుడి అరెస్ట్!

Author
Posted By Praja Nestham Jwala News
| 14 Nov 2026, 08:20 PM |
నేరేడుచర్లలో చికెన్ వాహనం నుంచి నగదు చోరీ.. నిందితుడి అరెస్ట్!

నేరేడుచర్ల: పట్టణంలోని జానపాడు రోడ్డులో గల గాంధీ చికెన్ సెంటర్ వద్ద బొలెరో వాహనంలో ఉంచిన నగదు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు చోరీకి పాల్పడిన నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీ చికెన్ సెంటర్ వద్ద నిలిపి ఉంచిన బొలెరో వాహనంలో రూ.7 వేల నగదును గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేశాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలను పరిశీలించి గూడూరు గ్రామానికి చెందిన చింతలచెరువు తిరుమయ్య (46)ను నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.5 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచినట్లు హుజూర్‌నగర్ సీఐ జి. చరమంద రాజు వెల్లడించారు.