Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించిన ఆత్రం సుగుణక్క

Author
Posted By Praja Nestham Jwala News
| 14 Nov 2026, 07:22 PM |
నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించిన ఆత్రం సుగుణక్క

హైదరాబాద్, నవంబర్ 14, (ప్రజానేస్తం జ్వాల): హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో భారత తొలి ప్రధానమంత్రి, భారతరత్న పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆత్రం సుగుణక్క మాట్లాడుతూ.. నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. దేశ తొలి ప్రధానిగా ఆధునిక భారత నిర్మాణానికి, విద్యా, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి నెహ్రూ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.