Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం.. ఒకే రోజు ముగ్గురు రైతుల ఆత్మహత్య

Author
Posted By Marelli kiran
| 13 Nov 2026, 07:07 PM |
ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాదం.. ఒకే రోజు ముగ్గురు రైతుల ఆత్మహత్య

హనుమకొండ, నవంబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): ఉమ్మడి వరంగల్ జిల్లాలో విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. పంట నష్టాలు, అప్పుల భారం కారణంగా ఒకే రోజు ముగ్గురు రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలు ఆయా గ్రామాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి.

నల్లబెల్లి మండలం బుజ్జూ తండాకు చెందిన జర్పుల వెంకటేష్ (27) రెండెకరాల్లో పత్తి సాగు చేయగా ఆశించిన దిగుబడి రాకపోవడంతో మనస్తాపానికి గురై బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నర్మెట మండలం ఆగాపేటకు చెందిన మెట్ల ఉప్పలమ్మ (50) పత్తి పంట నష్టపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. మహబూబాబాద్ జిల్లా వెంకట్రామ్ తండాకు చెందిన బానోతు రాములు (58) రెండెకరాల్లో సాగు చేసిన వరి, మొక్కజొన్న పంటలకు ఆశించిన దిగుబడి రాకపోవడంతో పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నట్లు తెలిసింది.

ఒకే రోజు ముగ్గురు రైతులు మృతి చెందడంతో వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. పంట నష్టాలు, అప్పుల సమస్యలతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఈ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి