Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

హనుమకొండ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు 117 పోలింగ్ కేంద్రాల ప్రతిపాదన

Author
Posted By Marelli kiran
| 13 Nov 2026, 06:57 PM |
హనుమకొండ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు 117 పోలింగ్ కేంద్రాల ప్రతిపాదన


33 కొత్త కేంద్రాల ఏర్పాటు.. 66,922 మంది పట్టభద్ర ఓటర్లకు సౌకర్యం: అదనపు కలెక్టర్ ఎన్. రవి

హనుమకొండ, నవంబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ కోసం హనుమకొండ జిల్లాలో 117 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించినట్లు అదనపు కలెక్టర్ ఎన్. రవి వెల్లడించారు. వీటిలో 84 పాత పోలింగ్ కేంద్రాలు కాగా, ఓటర్ల సౌకర్యార్థం మరో 33 కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. అలాగే ఆరు పోలింగ్ కేంద్రాల ప్రదేశాలను మార్చడంతో పాటు, మరో పది కేంద్రాల పేర్లను మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వివరించారు. ప్రతిపాదిత పోలింగ్ కేంద్రాల ద్వారా జిల్లాలోని 66,922 మంది పట్టభద్ర ఓటర్లకు ఓటు వేసే సౌకర్యం కల్పించనున్నట్లు అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.