Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం ఉండకూడదు

Author
Posted By Praja Nestham Jwala News
| 12 Nov 2026, 04:20 PM |
రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం ఉండకూడదు

ప్రభుత్వ భూముల పరిరక్షణ, భూ రీసర్వే వేగవంతం చేయాలి.. ఎమ్మెల్యే రేవూరి, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి

పరకాల, నవంబర్ 12 (ప్రజానేస్తం జ్వాల): రెవెన్యూ శాఖకు సంబంధించిన ప్రజా సమస్యలు, దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని పరకాల శాసనసభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అధికారులను ఆదేశించారు. ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. గురువారం పరకాల ఆర్డీవో కార్యాలయంలో వివిధ రెవెన్యూ అంశాలపై ఎమ్మెల్యే, కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా రెవెన్యూ సమస్యలు, దరఖాస్తుల పరిష్కారం, ప్రభుత్వ భూముల పరిరక్షణ, భూ రీసర్వే ప్రక్రియ తదితర అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ వాటి పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో అధికారులు ప్రత్యేక బాధ్యతతో వ్యవహరించాలని పేర్కొన్నారు. అలాగే భూ రీసర్వే ప్రక్రియను వేగవంతం చేసి, నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వేకు సంబంధించిన సమస్యలను గుర్తించి, వాటిని సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరించాలని తెలిపారు. భూముల సరిహద్దులు, రికార్డులకు సంబంధించిన అంశాల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

రెవెన్యూ శాఖకు సంబంధించిన ఏ ఒక్క దరఖాస్తు కూడా అనవసరంగా పెండింగ్‌లో ఉండకూడదని వారు స్పష్టం చేశారు. ప్రతి దరఖాస్తుపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, నిబంధనల ప్రకారం పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు. దరఖాస్తుల పురోగతి, పరిష్కార వివరాలను సంబంధిత దరఖాస్తుదారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే, కలెక్టర్ సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్డీవో వెంకన్న, తహసీల్దార్లు, సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.