Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

జీవో నంబర్‌ 9ను తక్షణమే రద్దు చేయాలి.. విద్యార్థులపై నిర్బంధం ఆపాలి

Author
Posted By Praja Nestham Jwala News
| 12 Nov 2026, 03:28 PM |
జీవో నంబర్‌ 9ను తక్షణమే రద్దు చేయాలి.. విద్యార్థులపై నిర్బంధం ఆపాలి

హైదరాబాద్, నవంబర్ 12 (ప్రజానేస్తం జ్వాల): విద్యార్థులను అరెస్టు చేసి జైళ్లలో పెట్టేందుకు ఉద్దేశించిన జీవో నంబర్‌ 9ను తక్షణమే రద్దు చేయాలని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం హిమాయత్‌నగర్‌లోని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర కార్యాలయంలో నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గత మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల విడుదల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై నిర్బంధ చర్యలు చేపట్టడం సరికాదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు విద్యార్థుల ఫీజులను పూర్తిగా భరించాలని, ప్రస్తుతం ఇస్తున్న రూ.5 వేల స్కాలర్‌షిప్‌ను రూ.15 వేలకు పెంచాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఫీజు బకాయిల కారణంగా ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తగిన బడ్జెట్ లేదని చెప్పడం సమంజసం కాదని, విద్యార్థుల ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేసి, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాటి వెంకటేశ్వరరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శులు పల్నాటి యాదయ్య, విజయుడు పాల్గొన్నారు.