Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

తెలంగాణలో టెట్ పరీక్ష వాయిదా.. నవంబర్ 22న నిర్వహణ

Author
Posted By Marelli kiran
| 11 Nov 2026, 07:25 PM |
తెలంగాణలో టెట్ పరీక్ష వాయిదా.. నవంబర్ 22న నిర్వహణ

హనుమకొండ, నవంబర్ 11 (ప్రజానేస్తం జ్వాల):

రాష్ట్రంలో ఇన్‌ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించాల్సిన తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీటెట్) పరీక్ష వాయిదా పడింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 19న పరీక్ష నిర్వహించాల్సి ఉండగా, అదే రోజున టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో విద్యాశాఖ డిపార్ట్‌మెంటల్ పరీక్షలు కూడా ఉండటంతో టెట్ పరీక్ష తేదీని మార్చారు.

ఈ మేరకు టెట్ పరీక్షను నవంబర్ 22వ తేదీన నిర్వహించనున్నట్లు పరీక్ష కన్వీనర్ జి. రమేష్ అధికారికంగా ప్రకటించారు. పరీక్ష తేదీ మార్పును అభ్యర్థులు గమనించి, అందుకు అనుగుణంగా తమ సన్నద్ధతను కొనసాగించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

అభ్యర్థులు నవంబర్ 17వ తేదీ నుంచి అధికారిక వెబ్‌సైట్ schooledu.telangana.gov.in ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు నిర్ణీత సమయంలో హాల్‌టికెట్లు పొందాలని సూచించారు.