Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కాజీపేట తెలంగాణ పబ్లిక్ స్కూల్‌కు శంకుస్థాపన

Author
Posted By Amruth Varma Bolugoddu
| 11 Nov 2026, 07:22 PM |
కాజీపేట తెలంగాణ పబ్లిక్ స్కూల్‌కు శంకుస్థాపన

కాజీపేట, నవంబర్ 11 (ప్రజానేస్తం జ్వాల): వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కాజీపేటలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి బుధవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) చైర్‌పర్సన్, మాజీ రాజ్యసభ సభ్యురాలు, జీడబ్ల్యూఎంసీ మాజీ మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యలతో కలిసి గుండు సుధారాణి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాజీపేటలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ద్వారా స్థానిక ప్రజలకు, విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. పాఠశాల నిర్మాణం పూర్తయితే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే అవకాశం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్, హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రాంరెడ్డి, ప్రియాంక గాంధీ ఆల్ ఇండియా సంఘటన్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు బిల్లా శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు గుండు పూర్ణచందర్, ఆకుతోట శిరీష్, పాలకుర్తి సుమన్ తదితరులు పాల్గొన్నారు.