Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మహిళా కాంగ్రెస్ నూతన జిల్లా అధ్యక్షురాళ్ల నియామకం: హనుమకొండ అధ్యక్షురాలిగా బంక సరళ!

Author
Posted By Marelli kiran
| 09 Nov 2026, 10:50 PM |
మహిళా కాంగ్రెస్ నూతన జిల్లా అధ్యక్షురాళ్ల నియామకం: హనుమకొండ అధ్యక్షురాలిగా బంక సరళ!

హనుమకొండ, 09 నవంబర్ 2026 (ప్రజానేస్తం జ్వాల- ప్రతినిధి : మారెల్లి కిరణ్):
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు నూతన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాళ్లను రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అధికారికంగా నియమించారు. హనుమకొండ జిల్లా అధ్యక్షురాలిగా బంక సరళ, వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా కర్నాటి పార్వతమ్మ, జనగామ అధ్యక్షురాలిగా వంగాల కళ్యాణి, మహబూబాబాద్ అధ్యక్షురాలిగా జిన్నారెడ్డి పద్మజ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలిగా గుమ్మడి శ్రీదేవిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా విభాగం బలోపేతానికి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి నూతన అధ్యక్షురాళ్లు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు.