Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా.. ఏకేవీఆర్ కళాశాలలో గ్రీన్ దీపావళి వేడుకలు

Author
Posted By Nagilla Rajinikanth
| 07 Nov 2026, 04:26 PM | TELANGANA
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా.. ఏకేవీఆర్ కళాశాలలో గ్రీన్ దీపావళి వేడుకలు

జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో గ్రీన్ దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా కాలుష్యరహిత దీపావళి జరుపుకోవాలనే సందేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు బాణసంచా కాల్చడం వల్ల ఏర్పడే వాయు, శబ్ద కాలుష్యాలపై అవగాహన కల్పించారు. పర్యావరణానికి హాని కలిగించకుండా దీపాలు వెలిగిస్తూ, ప్రకృతిని కాపాడుతూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు.
కళాశాల ప్రిన్సిపాల్ భూపతి శ్రీకాంత్ మాట్లాడుతూ.. దీపావళి వెలుగులకు ప్రతీక అని, పండుగ సంబరాల పేరుతో పర్యావరణానికి హాని కలిగించకూడదని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కాలుష్యరహిత దీపావళిని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేలా ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గ్రీన్ దీపావళి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.