Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

గురుకులంలో ర్యాగింగ్ కలకలం..

Author
Posted By Muthineni babu
| 07 Nov 2026, 03:04 PM |
గురుకులంలో ర్యాగింగ్ కలకలం..

పెద్దపల్లి, నవంబర్ 7 (ప్రజానేస్తం జ్వాల): పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థుల మధ్య జరిగిన వివాదం దాడికి దారితీసింది. పదో తరగతి చదువుతున్న విద్యార్థిపై నలుగురు తోటి విద్యార్థులు దాడి చేయడం కలకలం రేపింది. బ్లాంకెట్ విషయంలో మొదలైన వివాదం క్రమంగా తీవ్ర ఘర్షణకు దారితీసినట్లు సమాచారం. ఈ క్రమంలో నలుగురు విద్యార్థులు కలిసి బాధితుడి ముఖం, వీపుపై పిడిగుద్దులతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో విద్యార్థికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పాఠశాల ప్రిన్సిపాల్ బాధితుడికి ప్రథమ చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న బాధిత విద్యార్థి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఎస్సై ఎంబడి శ్రీకాంత్ ఘటనపై స్పందించి, దాడికి పాల్పడిన నలుగురు విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్థుల మధ్య చిన్నపాటి వివాదాలు దాడుల వరకు వెళ్లడం, గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, పర్యవేక్షణపై ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.