Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పాకాల సరస్సులో విషాదం.. తల్లి, ఇద్దరు పిల్లలు మృతి

Author
Posted By Muthineni babu
| 07 Nov 2026, 03:03 PM |
పాకాల సరస్సులో విషాదం.. తల్లి, ఇద్దరు పిల్లలు మృతి

ఖానాపురం, నవంబర్ 7 (ప్రజానేస్తం జ్వాల): వరంగల్ జిల్లాలోని ఖానాపురం మండల పరిధిలో ఉన్న పాకాల సరస్సులో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి సరస్సులో మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలు సేకరిస్తూ విచారణ చేపట్టారు. తల్లి ఇద్దరు పిల్లలతో కలిసి సరస్సులోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఘటనకు గల కారణాలేమిటి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు, ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.