Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

గట్టుప్పల్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై బీఆర్‌ఎస్ అవగాహన

Author
Posted By Praja Nestham Jwala News
| 06 Nov 2026, 07:35 PM |
గట్టుప్పల్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై బీఆర్‌ఎస్ అవగాహన

గట్టుప్పల్, నవంబర్ 6, (ప్రజానేస్తం జ్వాల): మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని బీఆర్‌ఎస్ నాయకులు సూచించారు. పట్టభద్రుల ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య ప్రక్రియలో పట్టభద్రుల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, తమ ఓటు హక్కును పొందడంతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తోటకూర శంకర్, పంకెర్ల ప్రభాకర్, మాజీ ఎంపీటీసీ గొరిగె సత్తయ్య, చిలుకూరి అంజయ్య, ఐతరాజు హనుమంతు, పున్న కిశోర్, పిశికె రాంబాబు, నరేందర్, నర్ని జగన్, కర్నాటి వెంకటేశం, పున్న ఆనంద్, గంజి కృష్ణయ్య, అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.