Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఆలయ వేలం నుంచి ముస్తఫాపూర్ పార్కింగ్‌కు మినహాయింపు ఇవ్వాలి

Author
Posted By Nagilla Rajinikanth
| 06 Nov 2026, 07:31 PM |
ఆలయ వేలం నుంచి ముస్తఫాపూర్ పార్కింగ్‌కు మినహాయింపు ఇవ్వాలి

భీమదేవరపల్లి, నవంబర్ 6, (ప్రజానేస్తం జ్వాల): కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ వేలం పాటల నుంచి ముస్తఫాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పార్కింగ్ స్థలాన్ని మినహాయించాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం దేవస్థానం కార్యనిర్వహణాధికారికి వినతిపత్రం అందజేసింది.

ఈ సందర్భంగా ఉపసర్పంచ్ తాళ్ల అరవింద్ గౌడ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, వార్డు సభ్యులు మాట్లాడుతూ.. శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రాకపోకలు, వాహనాల పార్కింగ్ కారణంగా ముస్తఫాపూర్ గ్రామం తీవ్ర ప్రభావానికి గురవుతోందని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తుల్లో అధిక సంఖ్యలో తమ గ్రామ పంచాయతీ పరిధి నుంచే రాకపోకలు సాగిస్తున్నారని పేర్కొన్నారు.

అయితే బ్రహ్మోత్సవాల సందర్భంగా పార్కింగ్ ద్వారా దేవస్థానం నుంచి ముస్తఫాపూర్ గ్రామ పంచాయతీకి ఎలాంటి ఆదాయం లేదా రుసుము చెల్లించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గ్రామ పరిధిలోని పార్కింగ్ స్థలాన్ని ఆలయ వేలం పాటల నుంచి మినహాయించి, పార్కింగ్ నిర్వహణ బాధ్యతలను గ్రామ పంచాయతీకి అప్పగించాలని కోరారు.

ఇవి కూడా చదవండి

ఈ ఏడాది నుంచి గ్రామ పరిధిలో పార్కింగ్, ఇతర నిర్వహణ కార్యక్రమాలను పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించి, తద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామ అభివృద్ధికి వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా పార్కింగ్ స్థలానికి వేలం నిర్వహిస్తే, గ్రామ పంచాయతీ పరిధిలో పార్కింగ్ ఏర్పాటుకు, రుసుముల వసూలుకు అనుమతించబోమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తాళ్ల అరవింద్ గౌడ్, కార్యదర్శి శ్రీనివాస్, వార్డు సభ్యులు, సీనియర్ జర్నలిస్ట్ కొండ్రోజు ప్రవీణ్ కుమార్, తాళ్ల రమేష్, రొంటాల ప్రభాకర్, ఎం. కంచరి ప్రవీణ్, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.