Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

డిసెంబర్ నుంచి మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ పనులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Author
Posted By Marelli kiran
| 06 Nov 2026, 07:28 PM |
డిసెంబర్ నుంచి మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ పనులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

హనుమకొండ, నవంబర్‌ 06 (ప్రజానేస్తం జ్వాల): మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతు, పునరుద్ధరణ పనులను డిసెంబర్ నెల నుంచి ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో దెబ్బతిన్న బ్యారేజీల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రూ.4,193 కోట్లను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.

బ్యారేజీలకు జరిగిన నష్టానికి నిర్మాణపరమైన లోపాలే ప్రధాన కారణమని సీఎం పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో చోటుచేసుకున్న లోపాలపై ఇప్పటికే పలు అంశాలను పరిశీలించినట్లు తెలిపారు. ప్రజాధనం వృథా కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా పునరుద్ధరణ పనులు చేపట్టనున్నట్లు వివరించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు భద్రత విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీపడబోదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బ్యారేజీల పునరుద్ధరణలో నాణ్యతా ప్రమాణాలు, సాంకేతిక నిపుణుల సూచనలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) సూచనలు, మార్గదర్శకాలకు అనుగుణంగానే పనులు చేపడతామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

బ్యారేజీల పటిష్టత, భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూ పునరుద్ధరణ పనులను ముందుకు తీసుకెళ్తామని సీఎం వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టును తిరిగి సమర్థవంతంగా వినియోగంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.