Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆరోపణలపై డీఎంపై సీఐడీ విచారణకు ఆదేశం

Author
Posted By Praja Nestham Jwala News
| 06 Nov 2026, 07:26 PM |
రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆరోపణలపై డీఎంపై సీఐడీ విచారణకు ఆదేశం

జయశంకర్ భూపాలపల్లి, నవంబర్‌ 06 (ప్రజానేస్తం జ్వాల): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రేషన్ బియ్యం అక్రమంగా పక్కదారి పట్టినట్లు వచ్చిన ఆరోపణలపై సంబంధిత జిల్లా మేనేజర్‌ (డీఎం) వ్యవహారంపై సీఐడీ విచారణకు పౌరసరఫరాల శాఖ ఆదేశించినట్లు సమాచారం. గత ఏడేళ్లుగా భారీ స్థాయిలో బియ్యం నిల్వలు, లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ నేపథ్యంలో బియ్యం నిల్వలు, సరఫరాలు, లావాదేవీలకు సంబంధించిన వివరాలను పరిశీలించేందుకు పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా వెలువడుతున్న కథనాలు, అక్రమాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం విచారణకు అనుమతి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

మరోవైపు, ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు జిల్లా మేనేజర్ గత కొన్ని రోజులుగా కార్యాలయానికి హాజరుకావడం లేదని సమాచారం. అయితే సీఐడీ విచారణకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు, ఆరోపణలపై సంబంధిత అధికారుల వివరణ ఇంకా స్పష్టంగా వెలువడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

విచారణ పూర్తయితే గత ఏడేళ్లలో జరిగిన బియ్యం నిల్వలు, సరఫరాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.