Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

చరిత్ర పుటల్లో కాగజ్‌నగర్ సర్ సిల్క్ కంపెనీ

Author
Posted By Praja Nestham Jwala News
| 06 Nov 2026, 02:41 PM |
చరిత్ర పుటల్లో కాగజ్‌నగర్ సర్ సిల్క్ కంపెనీ

కాగజ్‌నగర్, నవంబర్ 6 (ప్రజానేస్తం జ్వాల):

ఒకప్పుడు వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించి జీవనాధారంగా నిలిచిన కాగజ్‌నగర్ సర్ సిల్క్ కంపెనీ నేడు చరిత్ర పుటలకే పరిమితమైంది. 1939లో నిజాం పాలనలో ప్రారంభమైన ఈ పరిశ్రమ 1984లో మూతపడింది. అనంతరం 1991లో తిరిగి ప్రారంభమైనప్పటికీ కేవలం 11 నెలలకే మళ్లీ మూతపడింది.

ఈ పరిశ్రమ మూతపడటంతో ఎంతోమంది కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ పలువురు మాజీ కార్మికులకు రావాల్సిన బకాయిలు అందలేదని మాజీ కార్మికులు మహమ్మద్ అఫ్టల్, మహమ్మద్ మస్కీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమకు రావాల్సిన బకాయిలు చెల్లించి న్యాయం చేయాలని వారు కోరారు.

ఇవి కూడా చదవండి