Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అర్హులైన ప్రతి ఒక్కరూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు కావాలి: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

Author
Posted By Muthineni babu
| 06 Nov 2026, 10:45 AM |
అర్హులైన ప్రతి ఒక్కరూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు కావాలి: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

తొర్రూర్‌, నవంబర్‌ 6 (ప్రజానేస్తం జ్వాల): గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు తమ పేరును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. రోజువారీ పనులు, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కొంత సమయం కేటాయించి ఓటరు నమోదును పూర్తి చేసుకోవాలని సూచించారు.

ఓటు హక్కు ప్రతి పట్టభద్రుడికి ఉన్న ప్రజాస్వామ్య హక్కు అని, దాన్ని వినియోగించుకోవాలంటే ముందుగా ఓటరుగా నమోదు కావాలని పేర్కొన్నారు. చివరి తేదీ వరకు వేచి చూడకుండా అవసరమైన ధ్రువపత్రాలతో వీలైనంత త్వరగా నమోదు చేసుకోవాలని కోరారు.

కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, తోటి పట్టభద్రులకు కూడా ఓటు నమోదు ప్రాధాన్యతను వివరించి వారిని ప్రోత్సహించాలని సూచించారు. అర్హత ఉన్న ఒక్క పట్టభద్రుడు కూడా ఓటరు నమోదుకు దూరం కాకూడదన్నారు. మరింత మంది పట్టభద్రులకు అవకాశం కల్పించేలా ఓటరు నమోదు గడువును పొడిగించాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి