Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సూర్యాపేట జిల్లావ్యాప్తంగా ఈ నెల 30 వరకు పోలీస్ యాక్ట్ అమలు

Author
Posted By Praja Nestham Jwala News
| 05 Nov 2026, 08:05 PM |
సూర్యాపేట జిల్లావ్యాప్తంగా ఈ నెల 30 వరకు పోలీస్ యాక్ట్ అమలు


అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చర్యలు


డీజేలు, అధిక శబ్ద మైకుల వినియోగంపైనా నిషేధం

సూర్యాపేట, నవంబర్‌ 5 (ప్రజానేస్తం జ్వాల):

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈ నెల 30వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ కె. నరసింహ తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ఊరేగింపులు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి కార్యక్రమాలు నిర్వహించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అలాగే డీజేలు, అధిక శబ్దం కలిగించే మైకులు, లౌడ్‌స్పీకర్ల వినియోగంపై ఆంక్షలు విధించినట్లు తెలిపారు. ప్రజలకు, వాహనదారులకు అసౌకర్యం కలిగించే విధంగా వ్యవహరించరాదని సూచించారు.

జిల్లా ప్రజలు పోలీస్ శాఖ విధించిన నిబంధనలను పాటించి శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని ఎస్పీ కె. నరసింహ కోరారు.