Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

UPSC మెయిన్స్ 2026 ఫలితాలు విడుదల: ఇంటర్వ్యూకు 2,526 మంది అభ్యర్థులు ఎంపిక!

Author
Posted By Marelli kiran
| 05 Nov 2026, 07:13 PM |
UPSC మెయిన్స్ 2026 ఫలితాలు విడుదల: ఇంటర్వ్యూకు 2,526 మంది అభ్యర్థులు ఎంపిక!

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 2026 పరీక్షా ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. మొత్తం 1,016 ఖాళీల భర్తీ కోసం ఆగస్టు 21, 22, 23, 29, 30 తేదీల్లో నిర్వహించిన మెయిన్స్ పరీక్షలకు 13,343 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో రాతపరీక్షను క్లియర్ చేసి చివరి దశ అయిన పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ)కు మొత్తం 2,526 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థుల రోల్ నంబర్ల జాబితా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచబడింది.