Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఇరాన్‌తో యుద్ధం, ఇజ్రాయెల్ విధానాలే రిపబ్లికన్ల ఓటమికి కారణం: అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు!

Author
Posted By Marelli kiran
| 04 Nov 2026, 11:16 PM |
ఇరాన్‌తో యుద్ధం, ఇజ్రాయెల్ విధానాలే రిపబ్లికన్ల ఓటమికి కారణం: అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు!

హనుమకొండ, నవంబర్ 05 (ప్రజానేస్తం జ్వాల- ప్రతినిధి : మారెల్లి కిరణ్):
అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ పరాజయానికి ఇరాన్‌తో యుద్ధ వైఖరి, ఇజ్రాయెల్‌తో మైత్రి విధానాలే ప్రధాన కారణాలని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేస్తూ.. 2024 ఎన్నికల్లో ట్రంప్‌కు అండగా నిలిచిన అనేకమంది ఓటర్లు తాజా పరిస్థితులతో ఇతర పార్టీల వైపు మొగ్గు చూపారని పేర్కొన్నారు.

ప్రజలు మళ్లీ తమను విశ్వసించాలంటే ముందుగా యుద్ధాలను తక్షణమే నిలిపివేయాలని, ద్రవ్యోల్బణం నియంత్రణపై పూర్తి దృష్టి సారించాలని స్పష్టం చేశారు. 'అమెరికా ఫస్ట్' విధానాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తూ, ఇజ్రాయెల్‌తో సంబంధాల్లో అవసరమైన మార్పులు చేసుకోవాలని, ప్రజల్లో నెలకొన్న ఆగ్రహాన్ని అర్థం చేసుకుని దేశ ప్రయోజనాల కోసం ముందుకు సాగాలని వాన్స్ పిలుపునిచ్చారు.