Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

డ్రోన్ సర్వే, 3డీ మ్యాపింగ్‌తోనే వరంగల్ నగర సమగ్రాభివృద్ధి: కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్!

Author
Posted By Marelli kiran
| 04 Nov 2026, 11:15 PM |
డ్రోన్ సర్వే, 3డీ మ్యాపింగ్‌తోనే వరంగల్ నగర సమగ్రాభివృద్ధి: కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్!

హనుమకొండ, నవంబర్ 05 (ప్రజానేస్తం జ్వాల- ప్రతినిధి : మారెల్లి కిరణ్):
వరంగల్ మహానగర సమగ్రాభివృద్ధికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన డ్రోన్ సర్వే, 3డీ మ్యాపింగ్‌ ఆధారంగా పక్కా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని హనుమకొండ కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు ఎన్‌ఐటీ వరంగల్ మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా బుధవారం కలెక్టరేట్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎన్‌ఐటీ ప్రొఫెసర్లు నగర పర్యవేక్షణ, ప్రణాళికా రచనకు సంబంధించిన సరికొత్త సాంకేతిక విధానాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఇంజినీరింగ్ అధికారులు పరస్పర సమన్వయంతో ముందుకు సాగి నగర అభివృద్ధిని వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ తి. వెంకన్నతో పాటు పలువురు సాంకేతిక అధికారులు పాల్గొన్నారు.