Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రాండాస్ తండాలో ఫ్లోరోసిస్ సమస్యపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ పర్యటన

Author
Posted By Praja Nestham Jwala News
| 04 Nov 2026, 08:16 PM |
రాండాస్ తండాలో ఫ్లోరోసిస్ సమస్యపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ పర్యటన

నల్లగొండ, నవంబర్‌ 4 (ప్రజానేస్తం జ్వాల): గతంలో ఫ్లోరైడ్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొన్న నాంపల్లి మండలంలోని రాండాస్ తండాను జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ డాక్టర్ అన్వేష్ భట్టాచార్య సందర్శించారు. మిషన్ భగీరథ ద్వారా రక్షిత తాగునీటి సరఫరా, గ్రామస్థుల ఆరోగ్య పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడి గతంలో ఫ్లోరైడ్ నీటి వినియోగం వల్ల ఎదురైన ఆరోగ్య సమస్యలు, ప్రస్తుతం రక్షిత తాగునీరు అందుబాటులోకి వచ్చిన తర్వాత చోటుచేసుకున్న మార్పుల గురించి వివరాలు తెలుసుకున్నారు.

ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ద్వారా ఫ్లోరైడ్ సమస్యను నియంత్రించడంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడవచ్చని డాక్టర్ అన్వేష్ భట్టాచార్య పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ భగీరథ ద్వారా అందుతున్న తాగునీటి సౌకర్యాలను పరిశీలించారు.

ఇవి కూడా చదవండి

ఈ పర్యటనలో ఆర్డీవో శ్రీదేవి, తహసీల్దార్ అంజనేయులు, సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.