Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలి

Author
Posted By Praja Nestham Jwala News
| 04 Nov 2026, 06:33 PM |
ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలి

సూర్యాపేట, నవంబర్‌ 4 (ప్రజానేస్తం జ్వాల):

నల్గొండలో నవంబర్ 15 నుంచి 18 వరకు నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. నవంబర్ 15న రెండు లక్షల మంది రైతులతో భారీ ప్రదర్శన, అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని, తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించి రూ.50 వేల కోట్ల కరువు సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మహాసభల ప్రచారంలో భాగంగా బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 36 ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీ ప్రజలను ఆకట్టుకుంది.