Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

విధుల సమయంలో సబ్‌స్టేషన్‌లో మద్యం సేవనం: నలుగురు సిబ్బంది సస్పెండ్, ముగ్గురు ఉద్యోగం నుంచి తొలగింపు!

Author
Posted By Marelli kiran
| 04 Nov 2026, 05:12 PM |
విధుల సమయంలో సబ్‌స్టేషన్‌లో మద్యం సేవనం: నలుగురు సిబ్బంది సస్పెండ్, ముగ్గురు ఉద్యోగం నుంచి తొలగింపు!

హనుమకొండ, నవంబర్ 04 (ప్రజానేస్తం జ్వాల- ప్రతినిధి : మారెల్లి కిరణ్):
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం మంగళవారిపేట విద్యుత్ సబ్‌స్టేషన్‌లో విధి నిర్వహణ సమయంలో మద్యం సేవించిన వ్యవహారంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు తీవ్రమైన క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. అక్టోబర్ 29న జరిగిన ఈ అసాంఘిక ఘటనపై శాఖాపరమైన విజిలెన్స్ బృందం విచారణ జరిపి పూర్తిస్థాయి నివేదికను సమర్పించింది.

విజిలెన్స్ నివేదిక ఆధారంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు రెగ్యులర్ సిబ్బందిని విధుల్లోంచి తక్షణమే సస్పెండ్ చేయగా, ముగ్గురు ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించారు. అలాగే మరో ఉద్యోగికి టెర్మినేషన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు విద్యుత్ శాఖ ఏఈ మంగమ్మ అధికారికంగా ధ్రువీకరించారు. విధి నిర్వహణలో సిబ్బంది ఇటువంటి అనుచిత ప్రవర్తనలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.