Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

గ్రేటర్ వరంగల్ యూజీడీ పనులపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష!

Author
Posted By Marelli kiran
| 04 Nov 2026, 05:11 PM |
గ్రేటర్ వరంగల్ యూజీడీ పనులపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష!

హనుమకొండ, నవంబర్ 04 (ప్రజానేస్తం జ్వాల- ప్రతినిధి : మారెల్లి కిరణ్):
గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ (యూజీడీ) వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర సాంకేతిక అంశాలపై కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డి. తార బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా బల్దియా కమిషనర్ తి. వెంకన్న మాట్లాడుతూ.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రస్తుత ఆదాయ వనరులు, ప్రాజెక్టుల నిర్వహణకు స్వంత ఆదాయాన్ని మరింతగా సమకూర్చుకునేందుకు ఉన్న అవకాశాలను కేంద్ర బృందానికి సమగ్రంగా వివరించారు. ప్రాజెక్టు డీపీఆర్‌లోని సాంకేతిక అంశాలను చర్చించారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షలో బల్దియా ఎస్ఈ రాజ్‌కుమార్, ఈఈ రవికుమార్ తదితర సాంకేతిక ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.