Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నాణ్యత ప్రమాణాలు పాటించని కల్వర్టు పనులు.. విచారణకు డిమాండ్

Author
Posted By Praja Nestham Jwala News
| 04 Nov 2026, 03:41 PM |
నాణ్యత ప్రమాణాలు పాటించని కల్వర్టు పనులు.. విచారణకు డిమాండ్

పనుల్లో లోపాలపై అధికారుల నిర్లక్ష్యమే కారణమా? బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: ఇగరపు సంతోష్

నవంబర్‌ 4 (ప్రజానేస్తం జ్వాల): ఆసిఫాబాద్ మండలం కొమ్ముగూడ ఎస్సీ కాలనీ సమీపంలో నిర్మించిన కల్వర్టు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా విస్మరించారని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి (ఎస్సీ సెల్) ఇగరపు సంతోష్ ఆరోపించారు. వర్షాల సాకుతో హడావుడిగా పనులు పూర్తి చేయడంతో నిర్మాణంలో లోపాలు తలెత్తాయని విమర్శించారు. ఫ్లోరింగ్ పటిష్ఠంగా లేకపోవడంతో నీరు నిలిచి, మట్టి పేరుకుపోతున్నట్లు తెలిపారు. ప్రజాధనంతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యతకు తిలోదకాలివ్వడం ఆందోళనకరమన్నారు. సంబంధిత అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, నిర్మాణ నాణ్యతను పరిశీలించి, లోపాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.