Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మహిళా కండక్టర్ మృతికి నిరసనగా మధిర ఆర్టీసీ కార్మికుల విధుల నిలిపివేత

Author
Posted By Praja Nestham Jwala News
| 04 Nov 2026, 02:52 PM |
మహిళా కండక్టర్ మృతికి నిరసనగా మధిర ఆర్టీసీ కార్మికుల విధుల నిలిపివేత

ప్రవళిక మృతికి ఆర్టీసీ జేఏసీ సంతాపం

మధిర, నవంబర్‌ 4 (ప్రజానేస్తం జ్వాల): విధి నిర్వహణలో ప్రయాణికురాలి దాడికి గురై తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన టీజీఎస్ ఆర్టీసీ మహిళా కండక్టర్ ప్రవళిక మృతికి నిరసనగా మధిర ఆర్టీసీ డిపో కార్మికులు విధులు నిలిపివేసి సంతాపం ప్రకటించారు.

అక్టోబర్ 25న విధుల్లో ఉన్న కండక్టర్ ప్రవళికపై ఓ మహిళా ప్రయాణికురాలు దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 3వ తేదీ రాత్రి 10 గంటలకు మృతి చెందారు.

ఇవి కూడా చదవండి

ప్రవళిక మృతికి సంతాపంగా ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో మధిర డిపో కార్మికులు విధులు నిలిపివేసి నివాళులర్పించారు.