Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మున్సిపల్ సమావేశాల్లో అనధికార వ్యక్తుల జోక్యం తగదు

Author
Posted By Praja Nestham Jwala News
| 04 Nov 2026, 02:50 PM |
మున్సిపల్ సమావేశాల్లో అనధికార వ్యక్తుల జోక్యం తగదు

ఎన్నికైన కౌన్సిలర్లే సమావేశాలకు హాజరయ్యేలా ప్రొటోకాల్ అమలు చేయాలి: కౌన్సిలర్ పులిచింతల వెంకటరెడ్డి

హుజూర్‌నగర్, నవంబర్‌ 4 (ప్రజానేస్తం జ్వాల): మున్సిపల్ సమావేశాలు, అధికారిక చర్చలు, అభివృద్ధి కార్యక్రమాల నిర్ణయాల్లో అనధికార వ్యక్తుల జోక్యాన్ని నివారించి, ఎన్నికైన కౌన్సిలర్లు మాత్రమే పాల్గొనేలా నిబంధనలు అమలు చేయాలని 11వ వార్డు కౌన్సిలర్ పులిచింతల వెంకటరెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.

మున్సిపల్ సమావేశాల్లో కౌన్సిలర్ల కుటుంబ సభ్యులు, ఇతర అనధికార వ్యక్తులు పాల్గొనడం అధికారిక ప్రొటోకాల్‌కు విరుద్ధమని, దీనివల్ల పరిపాలనా వ్యవహారాల గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ల ద్వారా ఎన్నికైన మహిళా కౌన్సిలర్ల స్థానంలో వారి కుటుంబ సభ్యులు సమావేశాలకు హాజరుకావడం మహిళా సాధికారత లక్ష్యానికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి