Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రాష్ట్రంలో క్యాన్సర్ రీజినల్ సెంటర్లు: మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటన!

Author
Posted By Marelli kiran
| 04 Nov 2026, 09:07 AM |
రాష్ట్రంలో క్యాన్సర్ రీజినల్ సెంటర్లు: మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటన!

హనుమకొండ, నవంబర్ 04 (ప్రజానేస్తం జ్వాల- ప్రతినిధి : మారెల్లి కిరణ్):
తెలంగాణ రాష్ట్రంలో క్యాన్సర్ రోగులకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు త్వరలోనే రీజినల్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ ప్రాథమిక చికిత్సల కోసం రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లోనూ 'డే కేర్ సెంటర్లు' ఏర్పాటు చేసి, స్థానికంగానే రోగులకు కీమోథెరపీ సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. సాధారణ కీమోథెరపీ సెషన్ల కోసం నిరుపేద రోగులు సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేకుండా, వారి సొంత జిల్లాల్లోనే సకాలంలో పూర్తిస్థాయి చికిత్స అందేలా ఆసుపత్రుల మ్యాపింగ్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.