Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

బడిలో మద్యం తాగి విధులకు హాజరవుతున్న హెచ్ఎం

Author
Posted By Praja Nestham Jwala News
| 03 Nov 2026, 05:41 PM |
బడిలో మద్యం తాగి విధులకు హాజరవుతున్న హెచ్ఎం

మూడు రోజులుగా ఇదే పరిస్థితి.. విద్యార్థుల ఆరోపణలు

విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల డిమాండ్

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గంభీరావుపేటలోని ఎంపీయూపీఎస్ (MPUS) పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్ మద్యం సేవించి విధులకు హాజరవుతున్నారని విద్యార్థులు ఆరోపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని విద్యార్థులు తెలిపినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

విషయం తెలుసుకున్న గ్రామస్థులు పాఠశాలకు చేరుకుని, సర్పంచ్‌తో కలిసి ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, పాఠశాల క్రమశిక్షణను దృష్టిలో ఉంచుకుని సంబంధిత ఉన్నతాధికారులు ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్థులు కోరారు.

విద్యార్థులు చేసిన ఆరోపణలపై వాస్తవాలను నిర్ధారించి, తప్పిదం రుజువైతే నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గమనిక: హెచ్ఎంపై వచ్చిన ఆరోపణలు ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు.