Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రైతుల అభివృద్ధికి సహకార సంఘాల బలోపేతం: ఎమ్మెల్యే రేవూరి

Author
Posted By Nagaraju Golla
| 31 Oct 2026, 07:02 PM |
రైతుల అభివృద్ధికి సహకార సంఘాల బలోపేతం: ఎమ్మెల్యే రేవూరి

ఆత్మకూరు , అక్టోబర్ 31 (ప్రజానేస్తం జ్వాల): రైతుల ఆర్థిక అభివృద్ధికి సహకార సంఘాలు కీలకమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఆత్మకూరు మండలం పెంచికలపేట పీఏసీఎస్ నూతన చైర్మన్ ఎగితే లింగయ్య, పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ఎరువులు, విత్తనాలు, ఇతర సేవలు సకాలంలో అందించేలా నూతన పాలకవర్గం కృషి చేయాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని వ్యవసాయంలో నూతన పద్ధతులు అవలంబించాలని రైతులకు సూచించారు. క్లస్టర్ స్థాయిలో ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి