Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ములుకనూరు సహకార సంఘం అభివృద్ధి దేశానికే ఆదర్శం కావాలి

Author
Posted By Nagilla Rajinikanth
| 30 Oct 2026, 09:17 PM |
ములుకనూరు సహకార సంఘం అభివృద్ధి దేశానికే ఆదర్శం కావాలి

భీమదేవరపల్లి, అక్టోబర్ 30 (ప్రజానేస్తం జ్వాల):

రైతుల సంక్షేమం, గ్రామీణ ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ములుకనూరు సహకార సంఘం సాధిస్తున్న ప్రగతి దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలవాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి డా. జి. చిన్నారెడ్డి ఆకాంక్షించారు. శుక్రవారం భీమదేవరపల్లి మండలంలోని ములుకనూరు సహకార గ్రామీణ పరపతి, మార్కెటింగ్ సంఘాన్ని సందర్శించి కార్యకలాపాలను పరిశీలించారు.

సంఘం ప్రస్థానం, రైతుల అభ్యున్నతి కోసం చేపడుతున్న కార్యక్రమాలపై రూపొందించిన లఘుచిత్రాన్ని వీక్షించారు. అనంతరం ప్రాసెసింగ్ యూనిట్లను సందర్శించి వాటి పనితీరును తెలుసుకున్నారు. సంఘం అభివృద్ధికి దూరదృష్టితో కూడిన నాయకత్వం, రైతుల పట్ల నిబద్ధత ప్రధాన కారణాలని ప్రశంసించారు. మాజీ నాయకుడు ఏ.కె. విశ్వనాథరెడ్డి సేవలను కొనియాడుతూ, ప్రస్తుత అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి 18 గ్రామాల రైతు కుటుంబాల సంక్షేమానికి చేస్తున్న కృషిని అభినందించారు.

ఇవి కూడా చదవండి