Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

సుగంధ ద్రవ్యాలతో పద్మాక్షి అమ్మవారికి విశేష అభిషేకం

Author
Posted By Marelli kiran
| 30 Oct 2026, 09:14 PM |
సుగంధ ద్రవ్యాలతో పద్మాక్షి అమ్మవారికి విశేష అభిషేకం

హనుమకొండ, అక్టోబర్ 30 (ప్రజానేస్తం జ్వాల):

ఆశ్వీయుజ బహుళ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని హనుమకొండలోని చారిత్రక పద్మాక్షి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి మూలవిరాట్టుకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకం చేసి, విశేషంగా అలంకరించారు.

ఆలయ ప్రధాన పూజారులు నాగిళ్ల శంకర్ శర్మ, నాగిళ్ల షణ్ముఖ పద్మనాభ అవధాని పర్యవేక్షణలో వేదమంత్రోచ్ఛారణల నడుమ పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని, అభిషేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఇవి కూడా చదవండి