Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

గిరిజన డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలి

Author
Posted By Praja Nestham Jwala News
| 30 Oct 2026, 09:13 PM |
గిరిజన డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలి

హుజూర్‌నగర్, అక్టోబర్ 30 (ప్రజానేస్తం జ్వాల):

చేవెళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన గిరిజన డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు బానోతు హుస్సేన్ నాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం హుజూర్‌నగర్ టౌన్‌హాల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గిరిజనులకు మంత్రి పదవి, నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలని, తండా అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.

అర్హులైన గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, గిరిజన సమస్యలను పరిష్కరించాలని గిరిజన హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు నగేష్ రాథోడ్ కోరారు. 'గిరిజన గళం-తండాలో నిద్ర' పాదయాత్రకు పలు గిరిజన సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి