Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్ కె.హరిత

Author
Posted By Praja Nestham Jwala News
| 30 Oct 2026, 09:12 PM |
మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్ కె.హరిత

ఆసిఫాబాద్, అక్టోబర్ 30 (ప్రజానేస్తం జ్వాల):

ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందించాలని కలెక్టర్ కె.హరిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆసిఫాబాద్‌లోని గిరిజన సంక్షేమ పోస్టుమెట్రిక్ వసతి గృహాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా వంటగది, ఆహార పదార్థాల నిల్వలను పరిశీలించారు. వసతి గృహ పరిసరాలు, మరుగుదొడ్లు, స్నానపు గదులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, ఆహార నాణ్యత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి