Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఉర్సు రంగలీలా మైదానంలో ఘనంగా రావణ దహనం.. ట్రాఫిక్‌ను చక్కదిద్దిన పోలీసులు!

Author
Posted By Praja Nestham Jwala News
| 21 Oct 2026, 09:35 AM |
ఉర్సు రంగలీలా మైదానంలో ఘనంగా రావణ దహనం.. ట్రాఫిక్‌ను చక్కదిద్దిన పోలీసులు!

హనుమకొండ, అక్టోబర్ 20 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి: మారెల్లి కిరణ్): విజయదశమి సందర్భంగా వరంగల్‌లోని ఉర్సు రంగలీలా మైదానంలో రావణ దహనం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు నగరంతోపాటు పరిసర గ్రామాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. రావణాసురుడి దహనం, అనంతరం బాణసంచా వెలుగులు చూపరులను ఆకట్టుకున్నాయి. ప్రజలు, వాహనాల రాకతో మైదానం పరిసర ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ రద్దీ నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్‌, శాంతిభద్రతల పోలీసులు వాహనాలను దారి మళ్లించి రద్దీని నియంత్రించారు. పటిష్ట బందోబస్తు నిర్వహిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. పోలీసుల సమన్వయంతో వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి.