Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వరంగల్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయుధ పూజ నిర్వహించిన సీపీ శ్వేత

Author
Posted By Praja Nestham Jwala News
| 21 Oct 2026, 09:23 AM |
వరంగల్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయుధ పూజ నిర్వహించిన సీపీ శ్వేత

హనుమకొండ, అక్టోబర్ 20 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి: మారెల్లి కిరణ్): విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ పోలీస్ కమిషనరేట్ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత మంగళవారం సంప్రదాయబద్ధంగా ఆయుధ పూజ నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆయుధ భాండాగారంలో ప్రత్యేక పూజలు చేసి, అనంతరం పోలీస్ వాహనాలకు పూజలు చేశారు. జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి సంప్రదాయాన్ని పాటించారు. ఈ సందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణతోపాటు శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. విజయదశమి సందర్భంగా వరంగల్ కమిషనరేట్ పరిధి ప్రజలకు, పోలీస్ అధికారులు, సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.