Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అదనపు భవన నిర్మాణానికి శంకుస్థాపన

Author
Posted By Praja Nestham Jwala News
| 21 Oct 2026, 09:19 AM |
గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అదనపు భవన నిర్మాణానికి శంకుస్థాపన

హనుమకొండ, అక్టోబర్ 20 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి: మారెల్లి కిరణ్): గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో నూతన అదనపు భవన నిర్మాణానికి మంగళవారం ఉదయం శంకుస్థాపన నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి సదయ్య, కోశాధికారి అమర్ ఆధ్వర్యంలో పురోహితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు చేసి భూమిపూజ చేశారు. ప్రెస్ క్లబ్‌కు అదనపు ఆదాయ వనరులు సమకూర్చుకోవడమే లక్ష్యంగా పాలకవర్గ కమిటీ ఏకగ్రీవ నిర్ణయంతో ఈ భవన నిర్మాణాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, జర్నలిస్టులు, వివిధ జర్నలిస్టు యూనియన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.