Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వెల్‌నెస్ సెంటర్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

Author
Posted By Praja Nestham Jwala News
| 19 Oct 2026, 08:14 PM |
వెల్‌నెస్ సెంటర్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

హనుమకొండ, అక్టోబర్ 19 (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ప్రాంగణంలోని వెల్‌నెస్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, పరిసరాల పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని సిబ్బందిని ఆదేశించారు. మందుల పంపిణీ కౌంటర్ వద్ద రోగులు ఎక్కువసేపు వేచి ఉండకుండా ఆన్‌లైన్ డేటా ఎంట్రీ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అవసరమైతే అదనపు కంప్యూటర్‌ను వెంటనే ఏర్పాటు చేసి రోగులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.