Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

దసరాకు నిరంతర విద్యుత్ సరఫరా.. అధికారులకు సీఎండీ ఆదేశాలు

Author
Posted By Praja Nestham Jwala News
| 19 Oct 2026, 08:12 PM |
దసరాకు నిరంతర విద్యుత్ సరఫరా.. అధికారులకు సీఎండీ ఆదేశాలు

హనుమకొండ, అక్టోబర్ 19 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి మారెల్లి కిరణ్‌): దసరా పండుగ సందర్భంగా వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం 18 సర్కిళ్ల సూపరింటెండింగ్ ఇంజినీర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో విద్యుత్ సరఫరా ఏర్పాట్లపై సమీక్షించారు.

పండుగ వేళ అత్యవసర పరిస్థితులు మినహా విద్యుత్ నిలిపివేతలు, లైన్ క్లియరెన్స్‌లకు అనుమతించవద్దని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే వెంటనే స్పందించేలా అన్ని సర్కిల్, డివిజన్ కార్యాలయాల్లో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.