Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

దుర్గామాత రూపంలో దర్శనమిచ్చిన గణపేశ్వరుడు

Author
Posted By Praja Nestham Jwala News
| 19 Oct 2026, 08:07 PM |
దుర్గామాత రూపంలో దర్శనమిచ్చిన గణపేశ్వరుడు

గణపురం, అక్టోబర్ 19 (ప్రజానేస్తం జ్వాల):

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని చారిత్రక కోటగుళ్లలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ గణపేశ్వరుడి లింగాకారానికి దుర్గామాత రూపంలో విశేష అలంకరణ చేసి భక్తులకు దర్శనమిచ్చారు. కోటగుళ్ల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ప్రత్యేక హారతులు సమర్పించారు. శివలింగాన్ని దుర్గామాత స్వరూపంలో అలంకరించడంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ విశేష అలంకరణను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.